Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ పాత ఫొటోకు రీక్రియేషన్.. 'పెద్ది' ప్రమోషన్స్‌లో అరుదైన దృశ్యం!

Ram Charan and Shivrajkumar Recreate Chiranjeevi Rajkumar Photo
Advertisement
  • 'పెద్ది' సినిమా ప్రమోషన్స్‌లో రామ్ చరణ్, శివరాజ్‌కుమార్
  • తండ్రులు చిరంజీవి, రాజ్‌కుమార్‌ల నాటి ఫొటోకు రీక్రియేషన్
  • చరణ్‌ను ఆత్మీయంగా హత్తుకుని ముద్దాడిన శివరాజ్‌కుమార్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో
  • ఇరు కుటుంబాల మధ్య అనుబంధంపై ఫ్యాన్స్ ప్రశంసలు
Advertisement
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి, కన్నడ సినీ దిగ్గజం డా. రాజ్‌కుమార్ కుటుంబానికి మధ్య ఉన్న దశాబ్దాల అనుబంధం మరోసారి అందరినీ ఆకట్టుకుంది. రామ్ చరణ్, శివరాజ్‌కుమార్ కలిసి నటిస్తున్న 'పెద్ది' సినిమా ప్రమోషన్ల సందర్భంగా తమ తండ్రుల నాటి ఓ మధుర జ్ఞాపకాన్ని వారు రీక్రియేట్ చేశారు. ఈ ఎమోషనల్ మూమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ఇరు భాషల అభిమానులను కదిలిస్తోంది.

'పెద్ది' చిత్ర ప్రచారంలో భాగంగా రామ్ చరణ్, శివరాజ్‌కుమార్, జాన్వీ కపూర్ బెంగళూరులో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్, చిరంజీవిని డా. రాజ్‌కుమార్ ప్రేమగా ముద్దుపెట్టుకుంటున్న పాత ఫొటోను ప్రస్తావించారు. అయితే, ఆ అరుదైన క్షణం కెమెరాలో పూర్తిగా బంధీ కాలేదని చెబుతూ, అదే సన్నివేశాన్ని ఇప్పుడు రీక్రియేట్ చేయాలని రామ్ చరణ్, శివరాజ్‌కుమార్‌లను కోరారు.

యాంకర్ అభ్యర్థనకు శివరాజ్‌కుమార్ వెంటనే స్పందించారు. ఆయన రామ్ చరణ్‌ను ప్రేమగా, ఆత్మీయంగా హత్తుకుని బుగ్గపై ముద్దు పెట్టారు. ఈ అనూహ్య పరిణామం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రెండు లెజెండరీ కుటుంబాల మధ్య ఉన్న ఆప్యాయతకు, గౌరవానికి ఈ దృశ్యం అద్దం పట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. మెగా, కన్నడ అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తూ, వారి అనుబంధాన్ని ప్రశంసిస్తున్నారు.

ఒకప్పుడు చిరంజీవి, రాజ్‌కుమార్ కలిసి ఏ సినిమాలోనూ నటించకపోయినా, వ్యక్తిగతంగా మంచి స్నేహబంధాన్ని పంచుకున్నారు. ఆ బంధాన్ని ఇప్పుడు వారి వారసులు రామ్ చరణ్, శివరాజ్‌కుమార్ తెరపై కలిసి కనిపించడమే కాకుండా, నిజ జీవితంలోనూ కొనసాగిస్తుండటం విశేషం. 'పెద్ది' సినిమాలో శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో న‌టించిన విష‌యం తెలిసిందే. సినిమా విడుదలకు ముందే ఈ సంఘటన ప్రేక్షకుల్లో అంచనాలను, ఆసక్తిని మరింత పెంచింది. కేవలం సినిమా ప్రమోషన్‌గానే కాకుండా రెండు గొప్ప కుటుంబాల మధ్య తరతరాలుగా కొనసాగుతున్న స్నేహానికి ప్రతీకగా ఈ ఘటన నిలిచిపోయింది.
Advertisement
Advertisement
Ram Charan
Peddi
Shivrajkumar
Chiranjeevi
Rajkumar
Kannada cinema
Telugu cinema
Movie promotion
Recreation
Viral video

More Telugu News